EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గోల్కొండ కోట లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టాలి  :   తెలంగాణ ప్రభుత్వానికి శివసేన డిమాండ్ 

హైదరాబాద్ ఆగష్టు 18 (ఈతరం భారతం); బహుజన చక్రవర్తి శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి కార్యక్రమాన్ని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబర్ పేట్ గౌడ సంఘం వద్ద నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గంగపుత్ర మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల కొరకు పోరాడి 33 కోటలను జయించిన బహుజన చక్రవర్తి గోల్కొండ కోట పైన కూడా జెండా ఎగరేసినాడన్నారు. మొఘలుల మతోన్మాద మదాన్ని మట్టికరిపించిన మహావీరుడు..తెలంగాణ ప్రజలపై ఔరంగజేబు అరాచక పాలనను అంతమొందించిన పరాక్రమవంతుడు..గొల్లకొండ పై తెలంగాణ పౌరుషాన్ని పొగరుగా ఎగురవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శతకోటి వందనాలు.అలాంటి మహనీయుని 100 అడుగుల విగ్రహాన్ని గోల్కొండ కోటలో ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఇందులో పాల్గొన్నవారు బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎరుకల మహేందర్ గౌడ్. ఓంకార్ గౌడ్. శ్రీహరి గౌడ్. భాస్కర్ రెడ్డి. నర్సింగ్ ముదిరాజ్. రామకృష్ణ. రమేష్. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top