EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రామంతపూర్ ఘటన మృతుల కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలి     బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్

హైదరాబాద్ ఆగస్టు 19 (ఈతరం భారతం);రామంతపూర్ ఘటనపై ప్రభుత్వం దిగి రావాలి మృతుల కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేసారు.విద్యుత్ శాఖా నిర్లక్షం వాళ్ళ ఐదుగురు వ్యక్తులు మరనిచాదాన్ని నిరసిస్తూ రామంతపూర్ ప్రజలు మంగళవారం స్వచ్ఛందంగా బందు పాటిన్చారు. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి, పాఠశాలలు, కళాశాలలు కూడా బంద్ అయినాయి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా బంద్ చేశారు, కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే బంధు నుంచి మినాయింపు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం దిగి రావాలి మృతుల కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ప్రకటించడంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి విద్యుత్ శాఖలో ఉద్యోగం కల్పించాలి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇతరులకు మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేసారు.

Related News

Select the Topic
Scroll to Top