EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి! 16 గేట్లు ఎత్తివేసిన అధికారులు!

ఈతరం భారతం నిజామాబాద్ ఆగస్టు 23 :నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగు తుంది. శనివారం ప్రాజెక్టులో 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 80,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉంది. 16 గేట్ల ద్వారా 49,280 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1,500 క్యూసెక్కు లు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,090.8 అడుగుల వద్ద ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 79.65 టీఎంసీలు నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ అధికారులు వరద ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తూ, ఆగమాన నివారణ చర్యలను జాగ్రత్త గా కొనసాగిస్తున్నారని తెలిపారు. కొట్టుకుపోయిన మూల స్థానం కాజ్ వే కొనసాగు తున్న భారీ వర్షాలు, వరద నీరు అధికమవడంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాజ్‌వే, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం వద్ద శుక్ర వారం ఉదయం ఒక్కసారి గా నీటిమట్టం పెరిగింది.

Related News

Select the Topic
Scroll to Top