EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్థిరాస్తి సంబంధిత గ్యాంగ్ నేరాలపై కఠిన చర్యలు – 10 ఏళ్ల రికార్డు ఆధారంగా కేసులు నమోదు చేయాలి ఎస్పీ పరితోష్ పంకజ్

ఈ తరం భారతం ఆగస్టు 23 సంగారెడ్డి:జిల్లాలో స్థిరాస్తి సంబంధిత నేరాలను అరికట్టే లక్ష్యంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులు గ్యాంగ్ కేసుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గత 10 సంవత్సరాలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కనీసం రెండు క్రిమినల్ కేసుల్లో కలసి పాలుపంచుకున్నట్లయితే, వారిపై గ్యాంగ్ క్రైమ్ నిబంధనల కింద కేసులు నమోదు చేయాలని సూచించారు.

ఈ చర్యల ద్వారా సమాజంలో నేరాలకు అలవాటు పడే వ్యక్తులను తొలగించడం, భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించడం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. కొత్త చట్టం ప్రకారం గ్యాంగ్ కేసులు బెయిల్ లేని నేరాలుగా పరిగణించబడతాయని, దోషిగా తేలితే ఏడేళ్ల వరకు కఠిన శిక్షతో పాటు జరిమానా విధించబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top