యాదగిరిగుట్ట ,ఆగస్టు 23 ఈ తరం భారతం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం దరిచేరదని.. పరిసరాల పారిశుద్ధ్యంతోనే ప్రజారోగ్యం పదిలంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు ఉధృతంగా చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ అన్నారు.శనివారం యాదగిరి గుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పారిశుద్ధ్యం పనులు జరుగుతున్నాయా అని పరిశీలించారు. ఆయిల్ బాల్స్ పై గ్రామస్థులకి అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి పై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
మీ గ్రామంలో వర్షపు నీరు నిలిచిన గుంతల్లో ఆయిల్ బాల్స్ వేశారా? ఫాగింగ్ చేశారా? అని ఆరా తీశారు.మీ గ్రామంలో ఎవరికి అయిన జ్వరాలు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు.మీ గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, అన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయ అని ఎంపిడిఓ ని అడిగి తెలుసుకున్నారు. పేదవారు ఎవరైనా కట్టుకోలేని పరిస్థితి లో ఉంటే గ్రామంలో ఉన్న మరొక అర్హులైన వారికి ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.















