ఈతరం భారతం భువనగిరి ఆగస్టు 28 : యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలలో మహాగణపతి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈసారి పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో విగ్రహాలను కమిటీల ఆధ్వర్యంలో ప్రతిష్టించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బాల గణపతులను మట్టితో రూపొందించి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటి చెబుతూ బాలలు వేడుకలు జరుపుకోవడం ఈసారి ప్రత్యేకతగా భావిస్తున్నారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలతో పాటు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మండపాలను అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించడంతో జిల్లా అంతటా పండగ సందడి ఏర్పడింది. భక్తి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా వినాయక వేదికల ఏర్పాట్లు శోభాయ మానంగా జరిగాయి.















