ఈతరం భారతం ఆలేరు ఆగస్టు 28 :యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ జువెలరీస్ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.















