EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

చేను కాడ : కథ డా. పెరుక రాజు

చేను కాడ

సాయంత్రం గోధూళి వేళ.గల్లీ అంతా ఎర్రదుమ్ము ఎగిరిపోతుంది.బైక్ గుగ్గులుమని వస్తోంది.బైక్ మీద వేణు – వెనక వెన్నెల.వెన్నెల అడిగింది….

“ఏయ్యా వేణూ… శ్రావణి పిలిచిందన్నావు కదా? ఎక్కడికి లాక్కుంటున్నావురా?”వేణు నోట్లో వంకర నవ్వు –

“రా రా, చేను దగ్గర కూచోబెట్టింది… చూపిస్తా.” అన్నాడు.చేను కాడకి రాగానే –

ఎవరూ లేరనుకున్నా, ఓ మూలలో ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు.వెన్నెల గుండె దడదడలాడింది.

“వీళ్లు ఎవ్వరు?” అని అడిగింది.వేణు వెక్కిరిస్తూ …..

“ఏవో నా స్నేహులు. శ్రావణి ఏదీ లేదు. నిన్ను చూసి మోసం చేశా. మాకోసమే వచ్చావ్!” అని దురుసుగా అన్నాడు.అంతలోనే ఆ ఇద్దరూ వెన్నెలని పట్టుకోబోతుంటే –

చీకట్లోంచి ఒక్కసారిగా ఒక గర్జన……

“ఏరా రౌడీలూ! ఎవరి పిల్లని లాక్కుంటార్రా?! బుద్ధి లేదా మీకూ?!”

ముగ్గురూ వణికిపోయారు.

చెట్ల మధ్యనుంచి గడ్డం దువ్వేసిన, కర్ర పట్టుకున్న ఓ పెద్దాయన బయటకొచ్చాడు.

“ఏరా మూర్ఖపు పోరగాండ్లూ!

చేను కాడ ఆటల కోసం కాదుర్రా!

ఇది రైతు రక్తం, పల్లె గౌరవం.

ఇక్కడ మీ బజ్జార్లకు చోటు లేదు!”అన్నాడు కర్కశంగా.

పోకిరి గాళ్లు బైక్ స్టార్ట్ చెయ్యబోయారు.

ఒకదాని తాళం లేదు, ఇంకొకటి మండి పడింది.వాళ్లు గబగబా పరుగు తీశారు.

పెద్దాయన వెన్నెల దగ్గరకి వచ్చి –“బంగారు, భయపడకురా. నేను ఉన్నా. ఏమైందమ్మా, ఎందుకురా వీళ్లతో?” అన్నాడు.

వెన్నెల కన్నీళ్లు కారుస్తూ:

“తాతయ్యా… నా ఫ్రెండ్ పేరు మీద అబద్ధం చెప్పి లాక్కొచ్చాడు. నువ్వు రాకపోతే నన్ను పాడు చేసేవాళ్లు. దేవుడిలా వచ్చి కాపాడావ్!”పెద్దాయన ఆమె భుజం మీద చేయి వేసి నెమ్మదించాడు.

ఒక ఆటో పిలిపించి ఇంటికీ పంపించాడు.అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ దుర్మార్గాల్ని అరెస్ట్ చేయించాడు.

మరుసటి రోజు…వెన్నెల తన బంధువులందరిని తీసుకుని ఆ పెద్దాయన దగ్గరికి వచ్చింది.

అందరూ ఆయన కాళ్లకి పడిపోయి …

“మీరుంటే మేమున్నాం తాతయ్యా… ఈ ఋణం తీర్చలేం!” అని అన్నారు.

వాళ్లు ఇచ్చిన డబ్బు పెద్దాయన ఒప్పుకోలేదు.

“వద్దురా పిల్లలూ… ఇది నా కర్తవ్యం.

డబ్బు మీ పిల్లల చదువుకో పెట్టండి.

మీరు బాగుండటం అదొక్కటే నాకు సంతోషం!”అని పెద్దాయన సీరియస్‌గా అన్నాడు.

చివర్లో వెన్నెల ఆ పెద్దాయనతో ఒక సెల్ఫీ దిగింది.

అందరి కళ్లల్లో ఆనందపు కన్నీళ్లు మెరిశాయి.

చేను మీద గాలి ఆడింది…

చినుకులు రాలాయి…

గ్రామం మొత్తం ఆ పెద్దమనిషి ధైర్యాన్ని పొగడ్తలతో నింపింది.

పోకిరి గాళ్లు మాత్రం జైలులో

“ఏందిరా ఈ పిచ్చి చేసాం… మన దశ ఇదిలా అయ్యింది” అని తల పట్టుకుని కూర్చున్నారు.

డా. పెరుక రాజు : ఫోన్ 7810032847

Related News

Select the Topic
Scroll to Top