బాసర సెప్టెంబర్ 13 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర సరస్వతి దేవాలయం సమీపములో గల కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర మాసోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 21 న ప్రత్యేక పూజా కార్యక్రమములు మరియు గణపతి, రుద్ర ,సరస్వతి ,హోమములు , సాంస్కృతిక సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీ నిర్మల అంబికానాధశర్మ తెలిపారు.ఇందులో బాగంగా భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ శారద నృత్యాలయ కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యాచార్యులు శ్రీమతి డి కావేరి వారి శిష్య బృందం చే నృత్య కళార్చన మరియు శివాంశ సంభూతులు శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి జీవిత శైలి అనే అంశం పై కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కేర్యక్రమం లో శ్రీ బొందెడి పురుషోత్తం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ,శ్రీ డాక్టర్ కోవెల శ్రీనివాసాచార్య విశ్రాంత ప్రధానాచార్యులు కవి మరియు విమర్శకులు శ్రీ నర్లావుల రఘు విశ్రాంత ఉపాధ్యాయులు, కవి ,నటులు, గాయకులు. శ్రీ కంకణాల రాజేశ్వరరావు కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ,శ్రీ తొగళ్ళ సురేష్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముప్కాల్ మరియు కవి శ్రీ వాంగే సంధ్యారాణి తెలుగు పండితులు మరియు కవయిత్రి శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్య రత్న అవార్డు గ్రహీత మరియు వైదిక సిద్ధాంత జ్ఞాతకులు శ్రీ కిరణ్మయి అక్షర్యాన్ అదిలాబాద్ జిల్లా ప్రతినిధిశ్రీ హరిప్రియ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరియు కవయిత్రి ,శ్రీ మద్దుకూరి సాయిబాబా కవి మరియు సైకాలజిస్ట్బి మొదలగు వారు పాల్గొంటున్నారని ఇంకా కొందరికి సాహితీవేత్తలు అవకాశం ఉందని ఆసక్తి గల వారు 9948332032 సంప్రదించి ఈనెల 15 వ తేదీ లోపు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా శివ శ్రీ నిర్మల అంబికానాధశర్మ తెలిపారు














