హైదరాబాద్ అక్టోబర్ 3 (ఈతరంభారతం ); మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని రోడ్ నెంబర్ వన్ కెపిహెచ్బి కాలనీ హైదరాబాద్ నందుగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సందర్భంగా డాక్టర్ పద్మిని గారు మాట్లాడుతూ గాంధీ బోధించిన అహింస శాంతి మార్గంతో ఆ రోజుల్లో ఏ విధంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము అలాగే శాంతితో ముఖ్యంగా యువత తమ భవిష్యత్తుని సన్మార్గ మార్గంలో పయనించి దేశాభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాలలో గాంధీ బోధించిన శాంతి మార్గాన్ని విద్యార్థుల్లో ప్రభావితం చేసే విధంగా పాఠ్యాంశాలుగా మరింతగా ప్రవేశపెట్టాలని కోరారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాదెండ్ల సుధాకర్ సామాజికవేత్తలు వేల్పూర్ శ్రీనివాస్ విజయదేవి తదితరులు పాల్గొన్నారు















