EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్ర‌శాంత్ కిషోర్ ఒక పొలిటిక‌ల్ ప్రిపేయిడ్ రిచార్జ్-   టీపీసీసీ మీడియా & క‌మ్యూనికేష‌న్ చైర్మ‌న్ సామా రామ్మెహ‌న్ రెడ్డి

హైద్రాబాద్ అక్టోబర్ 4.. ఈ తరంభారతం :ప్ర‌శాంత్ కిషోర్ ఒక రాజ‌కీయ చోర్, మాటలకే పరిమితం అని టీపీసీసీ మీడియా & క‌మ్యూనికేష‌న్ చైర్మ‌న్ సామా రామ్మెహ‌న్ రెడ్డి, అన్నారు.ఆయ‌న ప్రిపేయిడ్ రిచార్జ్ లాంటి వాడు . ఎంత రిచార్జ్ చేస్తే అంత టాక్ టైం. అంతే, అంతకుమించి కాదు.

బీహార్ ప్రజల సంక్షేమం కోసం త‌న 50 ఏళ్ల జీవితంలో క‌నీసం 15 నిమిషాలు మాట్లాడిని పాపాన పోలేదు.  బీహార్ కోసం ఆయన ఏనాడు పనిచేయలేదు. ఇత‌ర నేతల పక్షాన టాక్‌టైమ్ లా ప్ర‌శాంత్ కిషోర్ మాట్లాడుతాడు. అలాంటి వ్య‌క్తిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఎన్నికల వ్యూహకర్తగా కోట్లు సంపాదించాడు త‌ప్ప పార్టీల‌ను ఆయ‌న గెలిపించినది లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అంత సీన్ ప్ర‌శాంత్ కిషోర్ కు లేదు. రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏలాంటి రాజకీయ నేపథ్యం లేదు. సామాన్య రైతు కుటుంబం నుంచి వ‌చ్చి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, విశ్వాసంతో సీఎం అయ్యారు. ఒక రోల్ మోడల్ సీఎంగా తెలంగాణ‌లో ప్ర‌జా పాల‌న అందిస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపున‌కు చూస్తోందన్నారు.

రేవంత్ రెడ్డిదమ్ము, ధైర్యం తెలంగాణ ప్రజలు. ప్రజలతో మమేకమై పాలన చేయడంలో రేవంత్ రెడ్డి ప్రత్యేకం. తెలంగాణ‌లో నివ‌సిస్తున్న‌ బీహార్ ప్రజలు ఎవ‌రిని అడిగినా ఇదే విష‌యం చెబుతారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న భేద‌భావం లేకుండా…తెలంగాణ‌లో ఉన్న అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను స‌మ‌భావంతో చూసే వ్య‌క్తి రేవంత్ రెడ్డి . ప్రజలను తన‌ గుండెల్లో పెట్టుకుని చూసే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు.పిపుల్స్ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రిపేయిడ్ రిచార్జ్ ప్ర‌శాంత్ కిషోర్ మాట్లాడటం పెద్ద జోక్ అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top