EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పల్లవికి జాతీయ అవార్డు..మంత్రి పొంగులేటి అభినందన

ఈతరంభరతం అక్టోబర్ 4 ఖమ్మం : పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన తాళ్లూరి పల్లవి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని… ఇది యువతకు ప్రేరణ కలిగించే ఘనత అని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరి పల్లవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌ విభాగంలో ఆల్‌ ఇండియా ట్రేడ్ టాపర్ గా నిలిచి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శనివారం జాతీయ అవార్డును స్వీకరించింది. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి ఓ ప్రకటన విడుదల చేశారు. పల్లవితో పాటు ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజితలను కూడా అభినందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top