EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈనెల 8వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు….

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5 :తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట్, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top