ఈతరం భారతం అక్టోబర్ 5 తెలంగాణ :గ్రేటర్ హైదరాబాద్లో వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే లక్ష్యంతో, 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీని ఆదేశించింది. దీంతో వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గి, ప్రజా రవాణా పెరిగి, నగరవాసుల ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. రాబోయే రెండేండ్లలో దశలవారీగా ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది.















