EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హ్యాట్సాఫ్ సారూ.. వృత్తి ధర్మానికి మీరే నిలువుటద్దం! – స్కూటీ ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయురాలికి ఆపన్నహస్తం – తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్

ఈతరం భారతం అక్టోబర్ 6 ఖమ్మం టౌన్:ప్రమాదం జరిగి రోడ్డుపై రక్త మోడుతూ విలవిలలాడుతుంటే సెల్ఫీలతో, ఫోటోలతో కాలక్షేపం చేస్తున్న రోజులివి. అలాంటిది స్కూటీ ప్రమాదంలో తలకు బలమైన గాయం తగిలి రక్తం కారుతూ ప్రమాదస్థితికి చేరుకుంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఆయన ఆపన్నహస్తం అందించారు. వెంటనే స్పందించి ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఆ టీచర్ కు ఆపపన్నహస్తం అందించిన ఆయన మరెవరో కాదు.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి డి సి హెచ్ ఎస్ రాజశేఖర్ గౌడ్.. వివరాల్లోకి వెళితే పెద్దగోపతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న మాధవి సోమవారం సాయంత్రం తన విధులను ముగించుకొని ఖమ్మం బయలుదేరారు. మార్గం మధ్యలో వి వెంకటాయపాలెం గ్రామ స్టేజీ వద్ద ఆమె ప్రయాణిస్తున్న స్కూటీకి కుక్క అడ్డు రావడంతో స్కూటీ రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం తగిలి రక్తమోడింది. రోడ్డు పక్కనే ఉన్న మీ సేవ నిర్వాహకురాలు నాగవాణి ఆమెకు సిపిఆర్ చేసి కొంతమేర సహాయం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top