ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 7 : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా… శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాత… గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు.















