ఈతరం భారతం/నిజామాబాద్ రూరల్/ అక్టోబర్ 22:
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఇందల్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించి సానుభూతి తెలిపారు.తిర్మన్ పల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సతీష్ తండ్రి కాపర్త రాములు గారి మృతిపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.తదుపరి, ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగాగౌడ్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాలయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, తిర్మన్ పల్లి మాజీ సర్పంచ్ చింతల కిషన్,నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ నరేష్, సీనియర్ నాయకులు మోహన్, యువ నాయకులు అతిష్, లోలం మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మల్లాపూర్ మాజీ సర్పంచ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.















