EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్  కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా అనురాగ్ జైన్‌

ఈతరం భారతం న్యూఢిల్లీ జులై 22

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్  కొత్త ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ ను నియమించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, శిక్షణ శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.డీఓపీటీ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. అనురాగ్ జైన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆయనకు మంజూరైన సేవా పొడిగింపు పూర్తయ్యే వరకు, అనంతరం మొత్తం రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు.. ఏది ముందుగా వస్తే అంత వరకు ఆయన నీతిఆయోగ్సీ ఈవోగా కొనసాగనున్నారు. అలాగే ఆయన నియామకం తనకు ముందు ఈ పదవిలో ఉన్న సీఈవోకు వర్తించిన అదే నిబంధనలు, షరతుల ప్రకారమే ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top