EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గోల్డ్ ఆల్ టైమ్ రికార్డు..ఇక సామాన్యులు కొనడం కష్టమే

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 21

బంగారం ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. గత రికార్డు ధరలను బద్దలు కొడుతూ పసిడి దూసుకుపోతోంది. ఇప్పటికే కేజీ వెండి ధర 3 లక్షల రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో బంగారం ధరలు కూడా తగ్గేదే లే అన్నట్లు రోజు రోజుకు భారీగా పెరుగుతూ వెళ్తున్నాయి. తాజాగా మరోసారి పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేశాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.5,020 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.4600 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.1,54,800కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,41,900కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉంది. ఎపిలోని విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top