EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సుద్దాల అశోక్ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం .. ఈనెల 22న ప్రదానం

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 12 శనివారం

_________________________________________

ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026 లభించనుంది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా అందజేస్తున్న బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈసారి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 22న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు అందించిన సేవలను గుర్తించడమే ఈ పురస్కారం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.పురస్కార కమిటీ ఛైర్మన్‌, అవార్డు వ్యవస్థాపకుడు కెప్టెన్‌ డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి ఈ విషయాన్ని ప్రకటించారు.

Related News

Select the Topic
Scroll to Top