ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 22
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందే తప్ప భౌగోళిక, రాజకీయ, సామాజిక తెలంగాణ రాలేదని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధిక ప్రయోజనం పొందిన లబ్దిదారులు, ఆంధ్ర టీవీ ఛానెళ్లు, పత్రికల యాజమానులేనన్నారు. ఈమేరకు మంగళవారం రాత్రి రవీంధ్రభారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ సాధన దిశగా ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమయోధులు ముచ్చర్ల సత్తన్న 93వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత దివంగత నేత సత్తన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, కప్పరి ప్రసాద్, పాశం యాదగిరి, సినీ దర్శకులు శంకర్, జయధీర్ తిరుమలరావు, విమలక్క, మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ పలువురు పాల్గొన్నారు. సభకి తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ అధ్యక్షత వహించారు. తొలి, మలిదశ తెలంగాణ ప్రజా ఉద్యమంలో ముచ్చర్ల సత్తన్న కవి, రచయిత, ఉద్యమకారుడిగా ఇలా బహుముఖ రంగాల్లో తన దైన శైలిలో కీలక పాత్ర పోషించడంమే కాకుండా ఉద్యమకారులను ఉత్తేజపర్చి ముందుకు పరుగులు పెట్టించారని వారు గుర్తు చేశారు
.















