EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మానవతా సేవలను మరింత విస్తృతం చేయాలి

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 22

రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి మొదటి సమావేశం లోక్ భవన్ (రాజ్ భవన్ )లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు విష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.లోక్ భవన్లో నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి మొదటి సమావేశంలో రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందించే మానవతా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రెడ్ క్రాస్ కార్యకలాపాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఆరోగ్యం, విపత్తు నిర్వహణ, రక్తదానం, పోషణ వంటి రంగాల్లో రెడ్ క్రాస్ పాత్రను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ఏజీఎం ను త్వరలో ఏర్పాటు రెడ్ క్రాస్ సొసైటీ యాక్టివిటీస్ విస్తరణ, రక్తదాన శిబిరాల నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలిచేలా కార్యాచరణ శాశ్వత సభ్యత్వ నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం జరిగింది. జూనియర్, యూత్ రెడ్ క్రాస్ను మరింత బలోపేతం చేసి యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేయడానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని గవర్నర్ గారు స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సులు నిర్వహించాలి ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఇంఛార్జ్ చైర్మన్ యం. దాన కిషోర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనితారామచంద్రన్ ఐఏఎస్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శృతి ఓజా ఐఏఎస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆయెషా మస్రత్ ఖణం ఐఏఎస్, ఎడ్యుకేషనల్ స్పెషల్ సెక్రటరీ : జి. వెంకటేశ్వర్లు, ఐఏఎస్ వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మరియు రాష్ట్ర పాలక మండలి సభ్యులు సాయి చౌదరి పాల్గొని, వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు, శాశ్వత సభ్యుల జాబితా, నివేదికను గవర్నర్ గారికి వివరించారు.ఈ సమావేశంలో పలు జిల్లాల రెడ్ క్రాస్ చైర్మన్లు, రాష్ట్ర పాలక మండలి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top