EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బై పాస్ రోడ్ విస్తరణ పనుల్లో జాప్యం పై హెచ్ఎండిఏ అధికారులపై జగ్గారెడ్డి, నిర్మల ఆగ్రహం

ఈతరం భారతం  సంగారెడ్డి జనవరి 22

సంగారెడ్డి పట్టణం లోని బైపాస్ రోడ్ విస్తరణ పనుల్లో జాప్యం పై HMDA అధికారులపై జగ్గారెడ్డి, నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో. గురువారం ఉదయం నుండే అధికారులు ఆగ మేఘాలపై పనులు ప్రారంభించారు. ఐబి ప్రహారీ గోడ ను జేసిబి ల సహాయంతో కూల్చి వేశారు. రోడ్ కు అడ్డంగా ఉన్న చెట్లను నరికి వేసి రోడ్ వెడల్పు పనులు ప్రారంభించారు. పనులకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఐబి గెస్ట్ హౌస్ నుండి సంగారెడ్డి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీకేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. విస్తరణ పనులు వేగవంతం కావడం పై పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. విస్తరణ పనులు పూర్తయితే ఐబి గెస్ట్ హౌస్ నుండి మొదలుకొని బస్వేశ్వర విగ్రహం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని పట్టణ వాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జ్, నాయకులు షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ లు ఐబి వద్ద పనులను పర్యవేక్షించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top