EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

25 న మల్కాజిగిరి లో స్టార్ మా సీరియల్స్ తారల సందడి!

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 23

స్టార్ మా ‘పొదరిల్లు’ జంట గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ – హైదరాబాద్లో కనీవిని ఎరుగని టెలివిజన్ మహోత్సవం జనవరి 25 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లో మల్కాజిగిరిలో శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్, అనుటెక్స్ చౌరస్తా లో జరగనుంది.ఈ సందర్బంగా ఒకే వేదికపై తొలిసారి స్టార్ మా సీరియల్స్ తారల సందడి చేయనున్నారు.స్టార్ మా ఛానల్లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ సీరియల్ ‘పొదరిల్లు’ హీరో–హీరోయిన్ వివాహ సందర్భంగా నిర్వహిస్తున్న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు హైదరాబాద్ నగర ప్రజలను ఆహ్వానిస్తున్నారు.ఈ శుభసందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, స్టార్ మా లో ప్రసారమవుతున్న అన్ని ప్రముఖ సీరియల్స్కు చెందిన నటీనటులు ఒకే వేదికపై తొలిసారి సందడి చేయనున్నారు. తమ అభిమాన హీరో–హీరోయిన్ను ఆశీర్వదించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి స్టార్ మా కుటుంబం మొత్తం ఈ వేడుకకు హాజరుకానుంది.ఇది కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాదు..స్టార్ మా ప్రేక్షకులకు ఒక అరుదైన పండుగ!ఒకే చోట, ఒకే వేదికపై మీకు ఇష్టమైన అన్ని సీరియల్స్ తారలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇదే తొలిసారి.ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్లో అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ‘పొదరిల్లు’ జంట ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలను ఆహ్వానిస్తోంది.స్టార్ మా కుటుంబం మొత్తం ఒక్కటయ్యే ఈ మహా సంబరాన్ని మిస్ కాకండి!..మీ అభిమాన తారలతో కలిసి ఈ ఆనంద క్షణాలకు మీరు కూడా సాక్షులవ్వండి!

 

 

Related News

Select the Topic
Scroll to Top