ఈతరం భారతం జనవరి 25హైదరాబాద్ :
దేశంలోని పౌరులందరికీ సమానంగా ఒక్కటే ఓటుహక్కు కల్పించిందని భారత రాజ్యాంగమేనని డా.బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డీ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సికిందరాబాద్ పిజి కళాశాల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సామూహిక ఓటు ప్రతిజ్ఞ జరిగింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ 2017 నుండి భారత ఎన్నికల సంఘం జనవరి 25 ను ఓటరు దినోత్సవంగా ప్రకటించిందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు లభించిందని అన్నారు. కులం, మతం, ప్రాంతం, ఆర్ధిక విషయంతో సంబంధం లేకుండా అందరికీ ఓటు వేసే అవకాశం దక్కిందని చెప్పారు . ఎన్నికల సమయంలో తక్కువ మంది ఓటుహక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు . ధన ప్రవాహం, కులం, మతం, లింగభేదం లేకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థి సేవా విస్తరణ విభాగం( ఎస్ ఎస్ బి )డైరెక్టర్ డా వై వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, విద్యార్థులు, పాల్గొన్నారు.















