ఈతరం భారతం యాదాద్రి భువనగిరి జిల్లా:
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలేరు కు చెందిన పలువురు ఉద్యోగులు ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు. ఎస్ టి ఓ కట్టా శ్రీనివాస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ బోడ చైతన్య, కందిగడ్డ తండా పంచాయతీ కార్యదర్శి సర్వర్ నాయక్ జిల్లా కేంద్రంలో అవార్డుల అందుకున్న వారిలో ఉన్నారు. అవార్డులను వారిని ఆయా శాఖల ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ఆత్మీయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.














