ఈతరం భారతం జనవరి 27 హైదరాబాద్ :
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిద్ధమైంది.రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లోనే ముగియనుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్వరకు రెండు వారాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే ప్రీ పోలింగ్ యాక్టివిటీ పూర్తయింది. స్ట్రాంగ్రూమ్లకు బ్యాలెట్ బాక్సులు చేరాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నేడు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం, బుధవారం మున్సిపల్ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.















