ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 28
పాలమూరు యూనివర్సిటీలో దశాబ్ద కాలానికి పైగా ఫార్మసీ విభాగంలో అధ్యాపకురాలిగా సేవలందిస్తున్న సుస్మిత గారు పీహెచ్డీ అవార్డును పొందారు. ఆమె డాక్టర్ మేనక పర్యవేక్షణలో“Bio-Analytical Method Development and Validation of Some Antiviral Drugs in Human Plasma by LC–MS/MS” అనే అంశంపై పరిశోధన చేసి, తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో పీహెచ్డీ వైవా–వోస్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
సుస్మిత స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా గొల్లపల్లి గ్రామం. ఆమె తల్లిదండ్రులు మాధవి – మనోహర్ గౌడ్. కాగా, భర్త కే. చక్రవర్తి చైతన్య గౌడ్.విద్యాభ్యాస పరంగా ఆమె
1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దీపిక మెమోరియల్ హై స్కూల్, షాద్‌నగర్,
ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, హైదరాబాద్,
బి.ఫార్మసీ – సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల, మహబూబ్‌నగర్,
ఎం.ఫార్మసీ – బీజూ పట్నాయక్ యూనివర్సిటీ, ఒడిశాలో పూర్తి చేశారు.
సుస్మిత చేసిన పరిశోధన ఫలితాలు పలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమవడం విశేషం. ఆమె పరిశోధన బయో-అనలిటికల్ మెథడ్స్, డ్రగ్ అనాలిసిస్ రంగాల్లో కీలకంగా ఉపయోగపడతాయి.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ గారు మాట్లాడుతూపీహెచ్డీ సాధించిన తర్వాత కూడా పరిశోధనలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఆధునిక పద్ధతుల ద్వారా ఫార్మకోడైనమిక్స్, ఫార్మకోకైనెటిక్స్ లక్షణాలను అధ్యయనం చేయడం వల్ల ఔషధం శరీరంలో ఎంత మోతాదులో, ఎంత సమయంలో వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యాధి తీవ్రతకు అనుగుణంగా సరైన డోసేజ్‌ను నిర్ణయించడం సాధ్యమవుతుందని, తద్వారా మానవ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించగలుగుతాయని పేర్కొన్నారు. ఔషధాల వినియోగం తగ్గడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం కలుగుతుందని ఆయన తెలిపారు.డా. సుస్మిత బోధన తో పాటు మహిళా వసతి గృహం కు వార్డెన్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోప్రిన్సిపాల్ డా. రవికాంత్ ,హెచ్‌ఓడీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ,
అధ్యాపకులు డాక్టర్ స్వాతి, శారద, డా ఈశ్వర్ కుమార్ డా. సుజాత, డా. సురేష్, డా. భూమయ్య, డా. రవికుమార్, డా. జ్ఞానేశ్వర్, డా. సోమేశ్వర్, డా. కోమటి సోమేశ్, డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొని సుస్మిత ను అభినందించారు.పీహెచ్డీ సాధించడం ద్వారా సుస్మిత విద్యా–పరిశోధనా రంగంలో మరో మైలురాయిని అధిగమించారని, ఇది యువ పరిశోధకులకు ఆదర్శంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు.















