ఈతరం భారతం హైద్రాబాద్ జనవరి.29
రాజ్యాంగబద్ధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాల్సిన మున్సిపల్ ఎలక్షన్ లను, హడావిడిగా,ఆకస్మికంగా మేడారం మహా జాతర సమయంలో నిర్వహించటం బిసి,బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని హననం చేయటమే అని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు దాసు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అట్టడుగు బీసీ బహుజన వర్గాలకు అత్యంత ఆరాధ్యదైవమైన సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర సమయంలో ప్రజలు కుటుంబ సమేతంగా దేవతారాధన చేసే వీలు లేకుండా ప్రజల ఆత్మ సంతృప్తిని హరిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఈ మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ను , ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు అవలంబించబోయే తదుపరి కార్యాచరణ నిమిత్తం వ్యూహాత్మక సమావేశాన్ని శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి బిసి రాజ్యాధికార సమితి కార్యాలయం బాగ్లింగంపల్లి నందు నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమానికి అనేకమంది తాజా, మాజీ మునిసిపల్ చైర్మన్లు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు.















