EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బిజెపి చార్జ్‌షీట్ విడుదల

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );

మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడుతూ “బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు” పేరిట భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ చార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ చార్జ్‌షీట్‌ను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. రాంచందర్‌ రావు , మహారాష్ట్ర మంత్రి, తెలంగాణ మున్సిపల్‌ & కార్పొరేషన్‌ ఎన్నికల ఇంచార్జ్‌ అశిష్‌ షెలార్‌ పార్టీ సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్‌ & కార్పొరేషన్‌ ఎన్నికల కో–ఇంచార్జులు అశోక్‌ పర్ణామి , ఎంపీ ఈటల రాజేందర్‌ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్‌. గౌతం రావు , రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్‌ ఎన్‌.వి. సుభాష్‌ , సీనియర్‌ నాయకులు జి. వెంకట్‌ రెడ్డి , సునీత , విఠల్‌ , కప్పర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top