ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 3
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు బడ్జెట్ లో కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జి రామ్ జి పథకంపై కాంగ్రెస్.. ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.96 వేల కోట్లు జి రామ్ జి పథకానికి నిధులు పెంచారని, ఎరువులపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల బడ్జెట్ కాదు.. వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టిన బడ్జెట్ అని.. తెలంగాణ ఒక హబ్ గా తయారవుతుందని, ఫార్మా, ఐటీ, హెల్త్ ఇలా హబ్ లకు హైదరాబాద్ కేంద్రం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా దేశ అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ గా చూడాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆవాస్ కింద రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించారని, జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేశారని ప్రశంసించారు.















