EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నో అనేది నా డిక్షనరీ లో లేదు.. మీరు కోరుకున్న పనులు పూర్తి చేస్తా

ఈతరం భారతం హైదరాబాద్ (మేడ్చల్) ఫిబ్రవరి 5

నో అనేది నా డిక్షనరీ లో లేదు.. మీరు కోరుకున్న పనులు పూర్తి చేస్తానని, గొంది దివ్య,లాజిశెట్టి రమ్య ఇద్దరిని గెలిపించాలని ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్ ముడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మపూర్ లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఓట్లు వేస్తాం కానీ రెండు పనులు చేయాలంటున్నారు. ఒకటి బండలమీద కట్టుకున్న ఇళ్ళకు టయిటల్స్ కట్టించమంటున్నారు.రెండు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న మల్లన్న గుడికి పొయ్యే దారి ఇప్పించాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా మల్లన్నను చెరనుండి విడిపిస్తా. పండుగ జరుపుకోవడానికి అనుమతి ఇప్పిస్తా. చట్టాలు చేసేది దేవుడు కాదు. చట్టాని మార్చే శక్తి మనకే ఉంటుంది. ఈ ఊరిని సీఎం దత్తత తీసుకున్నారు. మరి ఎందుకు ఇక్కడ భూములకు హక్కులు ఇప్పించలేక పోతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి.ఈ ఊరికి సర్వే నంబర్స్ వచ్చే వరకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. నో అనేది నా డిక్షనరీ లో లేదు. నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు నాలుగు వందల ఓట్లు ఉన్న ఊరికి రెండు కోట్లు పెట్టి బ్రిడ్జి వేయించిన. హుజురాబాద్ లో అలాంటివి 22 బ్రిడ్జులు కట్టించిన. పెన్షన్లు ఎవరి ఇంట్లోనుండి ఇవ్వడం లేదు. పెన్షన్ కు 12 వేల కోట్ల రూపాయలు అయితే..మనం తాగి మందుకు కట్టే పన్ను 50 వేల కోట్లు. పెన్షన్లు పెంచి, కొత్తవి ఇచ్చి ఓటు అడగాలని లక్ష్మాపూర్ నుండి రేవంత్డి రెడ్డి ని డిమాండ్ చేస్తున్నా. నేను సేవకుణ్ణి అంటారు నరేంద్ర మోడీ . ఇక్కడే వాక్సిన్ తయారు చేయించి దేశానికి అందించారు మన ప్రధాని నరేంద్ర మోదీ. మల్లారెడ్డి డబ్బును నమ్ముకున్నాడు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఎవరన్న డబ్బులు ఇస్తే తీసుకోండి.. ప్రమాణం చేయమంటే చేయండి. ముందు ధర్మానికి ఓటు వేస్తా ప్రమాణం చేసుకోండి. తరువాత వాళ్లు ఏం చెప్తే అది ప్రమాణం చేయండి. ఫస్ట్ చేసింది చెల్లుతుంది తప్ప రెండోది కాదు. మావాళ్లకు పైసలు లేవు కావొచ్చు కానీ మీకు పని చేస్తారు అని హామీ ఇస్తున్ననన్నారు

.

Related News

Select the Topic
Scroll to Top