EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలు త్వరలో అమలు

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 15

తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం కు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ధన్యవాదములు తెలిపింది.ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ , టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ నాయకులు నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసందర్బంగా ఫోరమ్ చైర్మన్ డా చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ ఉద్యమ కారుల ను పూర్తిగా విస్మరించితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో తెలంగాణ ఉద్యమ కారుల కి 250 గజాల ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం హామీల ను పెట్టటం జరిగింది. ఇచ్చిన హామీలను అమలు పై టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గత శాసన మండలి లో ప్రస్తావించటం జరిగింది. మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు హామీలను అమలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ప్రకటన చేయటం జరిగింది. ఈనెల లో హామీల అమలు ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్లు సమాచారం తో వారికి తెలంగాణ ఉద్యమ కారుల తరపున ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరో ఒక్కరి వల్ల రాలేదు 1200 మంది పైగా ఆత్మ బలిదానాలు తో వేలాది మంది ఉద్యమ కారుల ఉద్యమాలు పోరాటాల వల్ల వచ్చింది.త్యాగాలు ఉద్యమ కారులు చేస్తే భోగాలు రాజకీయ నాయకులు అనుభవించారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని వేల కోట్లు సంపాదించుకొని ఉద్యమ కారుల ను విస్మరించిన వాళ్ళని మరొక సారి నమ్మొద్దని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమ కారుల కి ప్రాధాన్యత ను ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న వాళ్లు దయానంద్. జగన్ యాదవ్. కొండా స్వామి. నాగ జ్యోతి.రజనీకాంత్.సంద్యారెడ్డి. జయ. సమ్మెట గౌడ్. బింగి రాజు భూపాల్.బాల నరసింహ.శివ కుమార్ నేత.జోగు అంజయ్య.చంద్ర శేఖర్.భానుప్రకాష్ రెడ్డి .గుప్తా. గొల్ల పల్లి నాగ రాజు . మంజూష తదితేరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top