EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న అర్హత గల అధ్యాపకులకు గైడ్‌ షిప్‌ కల్పించాలి

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 10

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న అర్హత గల అధ్యాపకులకు గైడ్‌ షిప్‌ కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఈ బ్రిజేష్‌ ఆధ్వర్యంలో నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.నరేష్‌ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పరిశోధనా రంగంలో రాణించేందుకు అర్హత కలిగి ఆసక్తి ఉన్న వారికి అవకాశమివ్వాలని కోరారు. గైడ్‌ షిప్‌ కల్పిస్తే ఉత్తమ, మేలైన పరిశోధనలు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ బి.శ్రీనివాస్‌ గౌడ్‌, మహిళా కార్యదర్శి డాక్టర్‌ భవానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ కార్యదర్శి డాక్టర్‌ సిహెచ్‌. రాకేష్‌ భవాని, సంఘ సభ్యులు డాక్టర్‌ సుభాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top