ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 11
శివరాత్రి సందర్భంగా TGSRTC 2,243 స్పెషల్ బస్సులు నడుపుతోంది. వీటిలో శ్రీశైలానికి 781, వేములవాడకు 416, కీసరకు 326 ఉన్నాయి. దీంతో స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లను సంస్థ 1.5రెట్లు పెంచింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇది అమల్లో ఉండనుంది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు. స్పెషల్ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు యథావిధిగా ఫ్రీ జర్నీ అమల్లో ఉంటుంది.శివరాత్రి నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఆర్టీసీ విసి అండ్ ఎండీ వై.నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ TGSRTC పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. గత శివరాత్రితో పోల్చితే ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందిహైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ఆర్టీసీ కల్పించింది. ముందస్తు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు www.tgsrtcbus.in వెబ్సైట్ నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.















