ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 12
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టగా, సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన బుద్ధ ప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. రవాణా, భూమి రికార్డులు, సామాజిక సంక్షేమంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్, సర్వే సెటిల్మెంట్లు అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.















