ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 12
శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రిటన్ పార్లమెంట్‌లో ఒక సామాన్య తెలంగాణ యువకుడు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉదయ్ నాగరాజుబ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’లో జీవితకాల సభ్యుడి (లైఫ్ పీర్)గా నియమితులు అయ్యారు. లండన్‌లో జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకలో ఆయన బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ముదురు ఎరుపు రంగు గౌను ధరించి.. భారతీయ మూలాలను స్మరిస్తూ భగవద్గీతపై ప్రమాణం చేశారు.















