ఈతరం భారతం ఫిబ్రవరి 15 కొత్తగూడెం:
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ కు చెందిన సీరపు సుగుణ, 13వ డివిజన్ కు చెందిన తలుగు శాంత, 34వ డివిజన్ కు చెందిన బట్టు విజయలక్ష్మి, 42వ డివిజన్ కు చెందిన దున్నపోతుల మణి, 48వ డివిజన్ కు చెందిన ధర్మసోత్ నరేష్ ఉన్నారు..క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.















