EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

“నేనే రాజు, నేనే మంత్రి’ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ వివరణ

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 15

తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలను అహంకారపూరితంగా చూడకూడదని, వాటి వెనుక ఉన్న పాలనాపరమైన అర్థాన్ని గమనించాలని ఆయన కోరారు. “నేనే రాజు.. నేనే మంత్రి అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నానని అర్థం” అని ఆయన వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తన పనితీరుకు గీటురాయిగా నిలుస్తాయని, పాలనలో జవాబుదారీతనం కోసమే తాను ఈ బాధ్యతలను భుజానికెత్తుకున్నానని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు

Related News

Select the Topic
Scroll to Top