EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రవ్యాప్తంగా పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 16

రాష్ట్రవ్యాప్తంగా పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాం,తొర్రూర్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరులో 16 వార్డులు ఉండగా బిఆర్‌ఎస్ -9, కాంగ్రెస్ -7 గెలుచుకున్నాయి. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎంఎల్‌ఎ యశస్వినిరెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎక్స్‌అఫీషియో ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. ఈ నేపథ్యంలో కడియం కావ్య ఓటుపై అభ్యంతరం చేస్తూ బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top