EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జెఇఇ మెయిన్స్ ఫలితాలు విడుదల..

ఈతరం భారతం  హైదరాబాద్ ఫిబ్రవరి 16

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఎంట్రెన్స్ కోసం విద్యార్థుల రాసే జెఇఇ మెయిన్స్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ముగ్గురికి 100 పర్సెంటైల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి వివన్ శరద్ మహీశ్వరికి, ఎపికి చెందిన ఇద్దరు విద్యార్థులు జి.నరేంద్ర బాబు, పసల మోహిత్‌కు 100 పర్సెంటైల్ వచ్చింది. ఒబిసి కేటగిరీలో నరేంద్రబాబు టాపర్‌గా నిలిచాడు. ఎస్సి కేటగిరీలో ఎపి విద్యార్థి దేవ శ్రీవేద్ టాపర్‌గా నిలిచాడు. ఈసారి 13.04 లక్షల మంది జెఇఇ మెయిన్స్ రాశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top