మంచిర్యాల ఫిబ్రవరి 17 ఈతరం భారతం:
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. మంత్రి వివేక్ వాహనంపై బిఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. మంత్రి వివేక్, ఎంపి వంశీ కృష్ణ కాన్వాయ్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్యాతనపల్లి దగ్గర పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్‌ను మున్సిపాలిటీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో బిఆర్ఎస్ శ్రేణులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. బయటి వ్యక్తులు ఎవరు మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు రావొద్దని పోలీసులు హెచ్చరించడంతో పాటు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లతో ఒకరు స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నారు. బిఆర్ఎస్కు పది సీట్లు గెలుచుకోగా సిపిఐ పార్టీలో గెలిచిన నలుగురు అభ్యర్థులు వీరికే మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్‌కు మొత్తం 11, బిఆర్ఎస్కు 14 స్థానాలు ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది.














