ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 18
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 387 కోట్లను విడుదల చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులు వెచ్చించాలని సూచించింది. అయితే 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి సుమారు రూ. 3000 కోట్లు రావాల్సి ఉంది.















