హైదరాబాద్ ఫిబ్రవరి 19 ఈతరం భారతం:
సిపిఐ(యం-ఎల్) చంద్రపుల్లారెడ్డి పార్టీ నుండి షేక్ షావలిని నెల రోజుల ముందే బహిష్కరించినట్లు సిపిఐ (ఎం-ఎల్) సిపి రెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి,మల్లేపల్లి ప్రభాకర్ తెలిపారు.గురువారం హైదరాగుడలో మీడియా సమావేశం లో పోలిట్ బ్యూరో మెంబర్ చిట్టి బాబు, సిపిఐ (ఎం-ఎల్) సిపి రెడ్డి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, పోలిట్ బ్యూరో మెంబర్ సంపంగి పద్మక్క, PWO జాతీయ అధ్యక్షరాలు, పోలిట్ బ్యురో మెంబర్, దిగంబర్, మహరాష్ట్ర పార్టీ కార్యదర్శి, పోలిట్ బ్యురో మెంబర్ తో కలిసి మాట్లాదారు. కమ్యూనిస్టు నైతిక విలువలు, మానసిక స్థైర్యం కోల్పోయి అరాచక గ్రూపులలో కలిసి పార్టీ నాయకత్వంపై పోస్టర్లు వేయడం షేక్ షావలి కమ్యూనిస్టు విలువలకు నిదర్శనమన్నారు. మెజార్టీ పోలిట్ బ్యూరో, జాతీయ కమిటీ సభ్యులకు తెలియకుండా, పార్టీ అంటే నేను నేను అంటే పార్టీ అంటూ షేక్ షావలి జాతీయ కార్యదర్శిగా ప్రకటించుకోవడమంటే ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనం. గత 3 సంవత్సరాల క్రితం సిపిఐ (యం-ఎల్) రాంచంద్రన్, సి పి ఐ (యం- ఎల్) ప్రతిఘటన, సిపిఐ (యం-ఎల్) క్రాంతి సంస్థలు ఐక్యం కావడం జరిగింది. 3 పార్టీల ఐక్యతలో ప్రతిఘటన పార్టీ మొత్తం బయటకు వెళ్ళిపోయింది, దీనికి కారణం షేక్ పావలి మొనార్కిజం వల్లే జరిగింది. ప్రస్తుతం షేక్ పావలి మిగిలి ఉండి, ఈయన చేస్తున్న పార్టీ వ్యతిరేక పనులు, విలేకరిగా ఉండటం, NGO, TUJAC, ఇతర సంస్థలతో పనిచేయడం, హైదరాబాద్ లో ఏ మీటింగ్ ఉన్నా పార్టీకి తెలియకుండా జవహర్ నగర్ నుండి పార్టీ పేరుతో ప్రజలను తీసుకెళ్ళడం, ప్రజల ఖర్చులు అంటూ మీటింగ్ నిర్వహకుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం దినచర్యగా మారిందని ఆరోపించారు.జనవరి 21, 22, 2026 న సంగారెడ్డిలో పోలిట్ బ్యూరో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సంఘాల రద్దు విషయం చేసింది షేక్ షావలి. దీన్ని కమిటీ ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంలోనే షేక్ షావలి పని విధానంపై చర్చ జరిగింది. విలేకరి, NGO, TUJAC, ఇతర ప్రజా సంఘాలతో, శాస్త్రీయ దృక్పథం లేని సంస్థలు, జెండా, ఎజెండా లేని సంస్థలను పార్టీ గుర్తించినప్పుడు వాటికి షేక్ షావలి వెళ్ళొద్దు అని పార్టీ సిరియస్ గా హెచ్చరించింది. దీనిపై పార్టీ షేక్ పావలి వివరణ కోరగా నేను పార్టీ పరంగా ఉండలేను మడికట్టు రాజకీయాలు నేను చేయను నేను వీటితోనే ఉంటాను అని వివరణ ఇవ్వడంతో పార్టీ సిరియస్ గా అలా ఉంటే పార్టీ నుండి సస్పెండ్ (బహిష్కరణ) చేయడం జరుగుతుందని అనడంతో షేక్ షావలికి తెలియజేయడం జరిగిందని వివరించారు. సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి మానసిక స్థైర్యం, విచక్షణ, నైతిక విలువలు, కమ్యూనిస్టు భావాలు మర్చిపోయి పార్టీ నాయకత్వంపై, బూర్జువా పార్టీలు సైతం తలదించుకునేలా పార్టీపై, నాయకత్వంపై పోస్టర్స్, కరపత్రాలు, సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలతో విరుచుకుపడుతున్న షేక్ షావలి పార్టీ ప్రజా కోర్టులో నిలబెడుతుందని పార్టీ హెచ్చరించడమైనది. పార్టీ నుండి ముందుగానే బహిష్కరణకు గురైన షేక్ షావలి, జాతీయ కమిటీ సభ్యులకు, రాష్ట్ర కార్యదర్శులకు, పోలిట్ బ్యూరోకు తెలియకుండానే తనకు తాను పార్టీ జాతీయ కార్యదర్శిగా పేపర్లకు ప్రకటన ఇవ్వడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ నైతిక విలువలు దెబ్బ తీసేలా తన చర్యలని మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజలు నమ్మవద్దని, దివాళా కోరుతనానికి పాల్పడుతున్న షేక్ షావలిని, ప్రజా సమూహం నుండి బహిష్కరించాలని మల్లేపల్లి ప్రభాకర్ విజ్ఞప్తి చేసారు.















