గాంధీ చౌక్ ఖమ్మం ఫిబ్రవరి 19 ఈతరం భారతం:
ముస్లీం మైనార్టీ జనాభా అధికంగా ఉన్న నగరంలోని 40, 42 డివిజన్ల రిజర్వేషన్ ను ముస్లీం మైనార్టీ లకు కేటాయించాలి అని ఆ వాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. కె.బాబు డిమాండ్ చేశారు.ఈవిషయమై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకోవాలని కోరారు.ఆయా డివిజన్ల పరిది లోని తుమ్మలగడ్డ, మోమినాన్ బజార్,నిజాంపేట, శుక్ర వారి పేట తదితర ప్రాంతాల్లో ముస్లీం జనాభా అధికంగా ఉందని తెలిపారు.సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు.ప్రభుత్వం జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన హామీ మేరకు ఎస్సి గా ఖరారు అయిన ఈ రెండు డివిజన్ల రిజర్వేషన్లను మార్చి ముస్లీం మైనార్టీ లకు కేటాయించాలి అని,లేని యెడల కార్పోరేషన్ ఎన్నికల్లో ముస్లీం మైనార్టీ ల సత్తా చూపుతామని హెచ్చరించారు.















