EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జెఎన్ జె హెచ్ ఎస్ డైరెక్టర్ పోస్టుకు టీం జెఎన్ జె తరఫున పోటీ ఎం. సాగర్ కుమార్ పోటీ

హైదరాబాద్ ఫిబ్రవరి 20 ఈతరం భారతం:

పేట్ బషీరాబాద్, నిజాం పేట్ లలో JNJHS కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాలను సాధించుకునేందుకే Team JNJ పోరాటం చేస్తోంది. ఈ పోరాటం విజయవంతం అయ్యేందుకు JNJHS లో Team JNJ తరఫున ప్రస్తుతం ఉన్న ఇద్దరు డైరెక్టర్లకు (పి వి రమణా రావు, కి. అశోక్ రెడ్డి) తోడుగా మరొక డైరెక్టర్ పోస్ట్ కు ఎం. సాగర్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాకలు చేసారు. 2026 మార్చి 1 న జెఎన్ జె హెచ్ ఎస్ డైరెక్టర్ పోస్టుకు ఎన్నికలు జరుగనున్నాయి. JNJHS ఒక డైరెక్టర్ పోస్టుకు జరిగే ఎన్నికల్లో Team JNJ తరఫున పోటీ చేస్తున్న ఎం. సాగర్ కుమార్ ను ఎన్నుకోవాలని JNJHS గౌరవ సభ్యులను పి వి రమణా రావు, అశోక్ రెడ్డి కోరారు.

Team JNJ లక్ష్యాలు:

పేట్ బషీరాబాద్, నిజాం పేట్ లలో ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని సాగర్ కుమార్ ఎన్నికైన మరు రోజు నుండి న్యాయ మార్గంలో పేట్ బషీరాబాద్, నిజాంపేట్ స్థలాల సాధనకు లీగల్ గా ఉన్న సమస్యలను న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో అధిగమిస్తాం. సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం మన్నారు.తాము ‘SPIRIT OF THE JUDGEMENT’ జర్నలిస్టులకు వ్యతిరేకం కాదు. BOD సమావేశాన్ని ప్రతి నెలా నిర్వహిస్తాం. సమావేశ జరిగే ముందు సభ్యులకు చెబుతాం. సమావేశం వివరాలను వెంటనే తెలియచేస్తామన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తాం. 2025 జూన్ , జూలై వరకు ఇంటి స్థలాలను ఇస్తామని ఫ్రెండ్స్ ప్యానెల్ గత సంవత్సరం ఫిబ్రవరి ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఫ్రెండ్స్ ప్యానెల్ తుంగలో తొక్కి, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తోంది. ఫ్రెండ్స్ ప్యానెల్ తరఫున గెలిచి ప్రెసిడెంట్, వైస్ – ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కి వచ్చిన వాళ్లు గత ఏడాది నుండి సభ్యులకు ముఖం చూపేందుకు కూడా ఇష్టపడ లేదు . జూన్, జూలై లోగా కాదు కదా ఇప్పటికి స్థలాలు ఇవ్వ లేదు. 18 ఏళ్లుగా JNJHS సభ్యులు కన్న కలలను ఫ్రెండ్స్ ప్యానెల్ నిర్వీర్యం చేసి, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సుదూరంగా ఉన్న ఫోర్త్ సిటీకి వెళదాం అంటున్నారు. సభ్యులు గమనించాలని వారు సబ్యులను కోరారు. వంశీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ప్యానెల్ వాళ్లకు పేట్ బషీరాబాద్, నిజాంపేట్ భూములను తీసుకుని సభ్యులకు మొదటి నుంచి ఇవ్వాలని లేదు. ఇందులో కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. అందుకే ఇప్పటి ఈ రెండు స్థలాల స్వాధీనానికి పని చెయ్యలేదు. సభ్యులను మభ్యపెట్టడమే వారి లక్ష్యం అనిపిస్తోందని, ఈ నేపధ్యంలో Team JNJ అభ్యర్థి ఎం. సాగర్ కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని సభ్యులను కోరారు. దివంగత సభ్యుల నామినీలకు ఓటు హక్కు కల్పిస్తా మన్నారు. బైలాస్ లో అవసరమైన మార్పులు చేస్తాం. ఒక్క సభ్యుడికి కూడా అన్యాయం జరగకుండా బైలాస్ మారుస్తామని తెలిపారు. చట్టపరంగా, న్యాయ పరంగా విలువైన పేట్ బషీరాబాద్, నిజాంపేట్ స్థలాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా సభ్యులకు అంద చేయాలన్నదే TEAM JNJ అంతిమ లక్ష్యం అని వారు స్పష్టం చేసారు.

Related News

Select the Topic
Scroll to Top