EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ అవుట్ డోర్ మీడియాకు న్యాయం చేయాలి  తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ జిహెచ్ ఎంసి కార్యాలయం ముట్టడి 

హైదరాబాద్ ఫిబ్రవరి 20 ఈతరం భారతం:

తెలంగాణ అవుట్ డోర్ మీడియాకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO) ఆధ్వర్యంలో శుక్రవారం GHMC కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మునిసిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండటంతో మా అసోసియేషన్ కు గత 2 సంవత్సరాల నుండి అప్పోయింట్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నాం మా సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకు వస్తుంది, ఇదిచాలా మంచి విషయం కానీ ఈ పాలసీ వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 450 కంపెనీలు రోడ్ మీద పడేసి ఒక మూడు కంపెనీ లకు మాత్రమే వ్యాపార అవకాశాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రైవేట్ బిల్డింగ్ పైన ఇప్పుడు ఉన్న వేలాది హోర్డింగ్స్ ( Roof top ) తీసేసి కొంతమందికే 2,3 కంపెనీలు మాత్రమే వ్యాపారం చేసుకొనే పరిస్థితి కల్పిస్తున్నారు అని వాపోయారు.ఇక్కడ ప్రైవేట్ భవనాల మీద మరియు ప్రైవేట్ భూముల్లో హోర్డింగ్ లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వాటిని తొలగించి, ప్రభుత్వ భూముల్లో R అండ్ B రోడ్ల మీద ఎలాంటి పన్నులు లేకుండా 2 లేదా 3 ఏజెన్సీ లను ప్రభుత్వం సమర్థిస్తున్నట్లు ఆ పాలసీ వస్తుంది వాఎరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొంతమంది కోసం GO No. 68 తీసుకొచ్చి సిటీని వాళ్లకు సంబంధించిన వారికి కట్టబెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది అనిపిస్తుంది.. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వళ్ళ రాష్ట్రంలో షుమారు 450 ఏజెన్సీలు 50 వేల కుటుంబాలు రోడ్ న పడతాయి, రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో 1927 నుండే అవుట్ డోర్ హోర్డింగ్ లు ఉండేవి. అలాగే ఇప్పుడు కూడా మన దేశంలో అన్ని రాజధానుల్లో ప్రైవేట్ బిల్డింగ్స్ పైన హోర్డింగ్స్ ఉన్నాయి, దయచేసి అనుమతి ఇస్తూ తగిన (safety,size floors regulations)జాగ్రత్తలు తీసుకోవాలి అని వారు విజ్ఞప్తి చేసారు. ఇక నైనా ప్రభుత్వం మధ్యవర్తుల మాటలని మరియు ఒక మూడు ఏజెన్సీల మాటలని పక్కన పెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీని తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అని వారు ముఖ్యమంత్రి ని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top