హైదరాబాద్ ఫిబ్రవరి 21 ఈతరం భారతం:
పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచన చేయాలని అన్నారు. 11రోజుల పాటు డిసిసి అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డిసిసి అధ్యక్షులే కీలకం అని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ త్యాగాల చరిత్ర ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 150 రోజులు పాదయాత్ర చేశారని, మిమ్మల్ని పార్టీ అధ్యక్షుల్ని చేసిందని తెలియజేశారు. మాదే సామ్రాజ్యం అనుకుంటే, ఇక్కడి నుంచే ఫెయిల్యూర్ మొదలవుతుందని, తాను పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఏం జరిగిందో చూశారని అన్నారు. ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లానని, నచ్చ చెప్పానని, ఆ తర్వాత నేతల ఆలోచనలో మార్పు వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. అందరం కలిసి పని చేస్తే సరిగ్గా రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వచ్చామని, ఎవరికి వారసత్వంగా హోదా రాలేదని చెప్పారు. 140 ఏళ్ల క్రితం ప్రారంభమైన పార్టీ, 140 కోట్ల మందికి స్ఫూర్తి నింపుతోందని, అలాంటి బిజెపి వారసతవం ఉన్నవాళ్లు బుల్లెట్ వర్షం కురిపించారని విమర్శించారు. బ్రిటీషర్ల జాతిపిత మహాత్మ గాంధీపై లాఠీ ఎత్తడానికి భయపడ్డారని, మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయని, ఒక కోటాలో మీరంతా డిసిసి అయ్యారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 రోజుల్లో 40 లక్షల సభ్యత్వ నమోదు చేశారని అన్నారు. డిసిసి అధ్యక్ష పదవి విలువైందని, దాన్ని ప్రజల కోసం వాడుకోండని, లేదంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని రేవంత్ రెడ్డి సూచించారు
.















