EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రజకులపై దాడి చేసిన నిందితులని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి 

హైద్రాబాద్ ఫిబ్రవరి 23 ఈతరం భారతం:

నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో గత బుధవారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులు స్వామివారి దర్శనం కోసం గుడిలోకి ప్రవేశించగా రజక కులస్తులు టికెట్టు లేకుండా గుడిలోపడికి రావద్దు అని రజకులపై దాడి చేయడం దుర్మార్గమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ,రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.సోమవారం బిసి భవన్ లో నగర్ కాకర్నూల్ సంఘటనపై 14 కుల సంఘాలు సమావేశమైనాయి.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశమ్ లో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యులు దాడి జరపొద్దని, బాధితులు పెత్తందారుల కాళ్ళపై పడి దండం పెట్టిన శ్రీనివాసరెడ్డి, మాధవరెడ్డి, సతీష్ రెడ్డి కాళ్లపై మొక్కిన కొట్టొద్దని ప్రాధేయపడ్డ కనికరించకుండా ఆవేశంతో ఊగిపోయిన పెత్తందారులు, బిడ్డను కాళ్లతో తన్ని విసిరేశారు. పసిపాప కొన ఊపిరితో అపస్మారస్థితిలోకి వెళ్లిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ పసిపాప మృత్యువుతో పోరాడి శనివారం రోజు మరణించిందని అన్నారు.ఇంత జరుగుతున్న పోలీసు యంత్రాంగం బాధితుల పక్షాన కేసు నమోదు చేయకుండా బాధితులపైనే తిరిగి కేసు నమోదు చేశారని అగ్రకులాల పెత్తందారులకు పోలీసులు వత్తాసు పలకడం సరైనది కాదన్నారు. పసిపాప హత్యకు కారణమైన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించే వరకు పోరాటంకొనసాగుతుందనిరాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అవమానకర దౌర్జన్య కొండపై బి.సి సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.నెలలు నిండిన పసిబిడ్డని నిర్దక్యంగా దురఅహంకారంతో హత్య చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. నిందితులని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి నష్టపరి హహరమ్ చెల్లించాలని డిమాండ్ చేశారు.నిఖిల్.పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ర్యాగ అరుణ్ కుమార్నీలంవెంకటెస్ జిల్లపల్లి అండ పగళ్ళ సతీష్ G.అనంతయ్య C.రాజేందర్ పర్లగోర్ల మోడీ రాందేవ్   తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top