ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 23:
ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి ద్రిక్ పంచాంగం తెరదించింది. హోలికా దహన్ మార్చి 3న, రంగుల పండుగ హోలీ మార్చి 4న జరుపుకోవాలని పండితులు పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 గంటలకు ప్రారంభమయ్యే పూర్ణిమ తిథి, మార్చి 3వ తేదీ సాయంత్రం 5:07 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం పౌర్ణమి ఉన్న రోజు సాయంత్రం హోలికా దహన్ నిర్వహించి, మరుసటి రోజు రంగులతో హోలీ జరుపుకోవడం ఆనవాయితీ.















